Friday, November 22, 2024

జనవరి 6న కేఆర్‌ఎంబీ భేటీ.. నీటి వాటాల‌పై చ‌ర్చించాల‌ని ఏపీ, తెలంగాణ‌కు లేఖ‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌: తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల వివాదం రావణ కాష్టంగా రగులుతూనే ఉంది. నీటి వాటాల పెంపుకోసం తెలంగాణ పట్టుపడుతుండగా పోతిరెడ్డి పాడు హెడ్‌ గెగ్యూలేటర్‌ సామర్ధ్యం పెంపును ఆంధ్రప్రదేశ్‌ సమర్ధించుకుంది. అయితే ఇటీవల జరిగిన రిజర్వాయర్ల మేనేజ్‌ మెంట్‌ కమిటీ సమావేశాలు అర్ధాంతరంగా ముగియడం,ఆర్‌ఎంసీ కన్వీనర్‌ గా వ్యవహరించిన రవికుమార్‌ పిళ్లే సిడబ్ల్యూసీ కి బదిలి కావడంతో తిరిగి సమావేశాలు నిర్వహించేందుకు కెఆర్‌ఎంబీ నిర్ణయింది. ఈ మేరకు జనవరి 6వ తేదీన నిర్వహించనున్న సమావేశాల్లో పాల్గొని అభ్యంతరాలపై చర్చించాలని కోరుతూ కేఆర్‌ఎంబీ తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖలు రాసింది.జస్టీస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యూనల్‌ ముందు కృష్ణా నదీ జలాల వివాదాలపై చర్చలు జరగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

6 జనవరి 2023 న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ జలసౌధాలో జరగనున్న ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు హాజరై తమ అభ్యంతరాలను, డిమాండ్లను తెలపాలని కెఆర్‌ఎంబీ కోరింది. ఈ మేరకు ఆంధ్ర,తెెలంగాణ రాష్ట్రా ఈఎన్సీలకు కెఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే నోటీసులు ఇచ్చారు. రాష్ట్రాల్లో ఉన్న సమస్యలపై ఎజెండాలో చేర్చేందుకు ప్రతిపాదనలు పంపాలని రాయిపురే కోరారు. ప్రధానంగా బోర్డు నిర్వహణ, నిధులు, గెడిట్‌ నోటిఫికేషన్‌ అమలు, ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణ, జలవిద్యుత్‌ ఉత్పత్తి, రెండురాష్ట్రాల మధ్య నీటి వాటా పై చర్చించనున్నట్లు రాయిపురే తెలిపారు. ప్రధానంగా రెండురాష్ట్రాల మధ్య నీటి వాటాల వివాదం, అనుమతులు లేని ప్రాజెక్టులు, మిగులు జలాల పంపిణీ, పరస్పర ఫిర్యాదులపై కృష్ణా నదీ యాజమాన్యం బోర్జు చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement