టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసు కృష్ణపట్నంలో నమోదైంది. శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదా రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆనందయ్య మందును ఆన్లైన్లో పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం తయారు చేసిన వెబ్‌సైట్‌పై మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకొని సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు.
మందు అమ్మకానికి వెబ్సైట్ తయారుచేసింది నెల్లూరుకు చెందిన సెశ్రిత కంపెనీ అని ఆరోపించడం కేసు పెట్టడానికి కారణమైంది. ఆ మందుతో పార్టీకి సంబంధం లేదని ప్రకటించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి. వెబ్సైట్ వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుట్ర చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. మందు అమ్మకానికి వెబ్సైట్ తయారుచేసింది నెల్లూరుకు చెందిన శేశ్రిత కంపెనీ అని వెల్లడించారు.