వెస్టిండిస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్.. ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. పంజాబ్ కింగ్స్ లెవన్ తరపున ఆడుతున్న గేల్ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బయో బబుల్ వాతావరణ ఆంక్షలను తట్టుకోలేక టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. తాజాగా దుబాయ్‌లో జరుగుతున్న ఎడిషన్‌లో అతను రెండు మ్యాచ్‌లు ఆడాడు. అయితే వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో గేల్ మానసిక వత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాడు. ఇటీవల సీపీఎల్‌లో ఆడిన గేల్ అక్కడ కూడా బయో బబుల్ వాతావరణంలోనే ఉన్నాడు. కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల సంరక్షణ కోసం బయో బబుల్ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి సీడబ్ల్యూఐ బబుల్‌లో ఉన్నానని, ఆ తర్వాత ఐపీఎల్ బబుల్‌లోకి వచ్చానని, ఈ నేపథ్యంలో మానసికంగా బలోపేతం కావాలనుకుంటున్నాని గేల్ ఓ ప్రటకనలో తెలిపారు. దుబాయ్‌లోనే బ్రేక్ తీసుకుంటానని, వరల్డ్‌కప్ టోర్నీలో విండీస్‌కు హెల్ప్ చేయాలనుకుంటున్నట్లు గేల్ చెప్పాడు
ఇది కూడా చదవండి: ఆ కేసులో వైఎస్ షర్మిల, విజయమ్మకు ఊరట..