Sunday, October 6, 2024

Nepal | నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ.. రేపే ప్రమాణ స్వీకారం

నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపాల్ లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా… ఒప్పందం ప్రకారం అధికార బదలాయింపునకు మాజీ ప్రధాని ప్రచండ అంగీకరించకపోవడం, ఆయనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) మద్దతు ఉపసంహరించుకోవడం తెలిసిందే. దాంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి దిగిక‌తప్పలేదు. దాంతో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్)… నేపాల్ కాంగ్రెస్ తో జట్టు కట్టి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కేపీ శర్మ ఓలిని ప్రధాని పదవి వరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement