తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి…. చాకలి ఐలమ్మ పేరు పెడతామని ప్రకటించారు. ఈరోజు సాయంత్రం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చరిత్ర ఎప్పటికీ మరువలేనిదన్నారు. ఆమె స్ఫూర్తితో మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ కుటుంబాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.