Tuesday, November 19, 2024

వజీర్‌ ఎక్స్ తో కోటక్‌ భాగస్వామ్యం.. క్రిఎ్టో కమ్యూనిటీకి ద్వారాలు తెరిచిన తొలి బ్యాంక్‌..

న్యూఢిల్లి: భారత్‌లో క్రిఎ్టో కరెన్సీ నియంత్రణకు అడుగులు పడుతున్న వేళ.. క్రిఎ్టో కరెన్సీ కమ్యూనిటీకి ద్వారా తెరచిన తొలి ప్రధాన బ్యాంక్‌గా కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ నిలిచింది. దేశంలోనే అతిపెద్ద క్రిఎ్టో కరెన్సీ ఎక్సేంజీగా ఉన్న వజీర్‌ఎక్స్‌ భాగస్వామ్యంతో కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ క్రిఎ్టో వ్యాపారాన్ని కొనసాగించనుంది. కోటక్‌ బ్యాంక్‌ వద్ద వజీర్‌ఎక్స్‌ ఒక ఖాతాను ఓపెన్‌ చేసింది. ఈ ఖాతా ద్వారా ఇన్వెస్టర్లు క్రిఎ్టో ఎక్స్చేంజీల నుంచి డబ్బులు రిసీవ్‌ చేసుకోవడం, చెల్లింపులు చేయడం జరుగుతాయి. అయితే ఈ ఖాతా కార్యకలాపాలు ఇంకా మొదలు కావాల్సి ఉంది. పేపర్‌ వర్క్‌, కేవైసీ, ఇతర టెస్టింగులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ఓ ప్రతినిధి తెలిపారు.

ఏడాది క్రితం దేశంలోనే రెండవ అతిపెద్ద బ్యాంక్‌ అయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ వద్ద వజీర్‌ఎక్స్‌ ఖాతాను ఓపెన్‌ చేసింది. వజీర్‌ఎక్స్‌ బిజినెస్‌లో ఎక్కువ భాగం డిజిటల్‌ వాలెట్‌, పేమెంట్‌ సర్వీసెస్‌ కంపెనీ మొబిక్విక్‌కి బదిలీ అయ్యింది. కాగా నియంత్రణ సంస్థల నుంచి ఇబ్బందులు ఉంటాయనే అంచనాలతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌, ఎస్‌బీఐ వంటి పెద్ద పెద్ద బ్యాంకులు క్రిఎ్టో ప్లాట్‌ఫామ్స్‌, విక్రేతల పేమెంట్లను కఠినంగా నియంత్రిస్తున్న విషయం తెలిసిందే. పేమెంట్‌ గేట్‌వే ఆపరేటర్లు.. క్రిఎ్టోతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న మర్చంట్లకు ఐసీఐసీఐ నెట్‌ బ్యాంకింగ్‌ను నిలిపివేయనున్నారని మే నెలలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఎస్‌బీఐ కూడా కీలక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

50 వేల డాలర్ల దిగువకు బిట్‌కాయిన్‌
అతిపెద్ద క్రిఎ్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ పతనం కొనసాగుతోంది. సోమవారం దాదాపు 1.5 శాతం వరకు దిగజారి దాదాపు 49,000 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతుంది. వారాంతంలో క్రిఎ్టో కరెన్సీ భారీ పతనం సోమవారం కూడా ప్రభావం చూపింది. దీంతో బిట్‌కాయిన్‌ ఫ్యూచర్స్‌లో పెట్టుబుడులు అక్టోబర్‌ నాటికి తగ్గాయి. కాగా అక్టోబర్‌ భారీగా ర్యాలీ అయిన బిట్‌కాయిన్‌ నవంబర్‌ 10న జీవితకాల గరిష్ఠం 69,000 మార్క్‌ను తాకిన విషయం తెలిసిందే. నాలుగో త్రైమాసికంలో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్టు స్టేక్‌ఫండ్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మ్యాట్‌ డిబ్‌ పేర్కొన్నారు. పతనం తర్వాత బిట్‌కాయిన్‌ పుంజుకుంటుంది. కానీ ప్రస్తుతం బిట్‌కాయిన్‌లో బలం కనిపించడం లేదని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement