బహుభాషా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కూ యాప్ లో 10 భాషల్లో అద్భుతమైన ఫీచర్ ‘టాపిక్స్’ ని విడుదల చేసింది. వివిధ భాషా యూజర్లకు ఈ అంశాలు అత్యంత వ్యక్తిగతమైన గొప్ప అనుభవాన్ని అందిస్తాయి. హిందీ, బంగ్లా, మరాఠీ, గుజరాతీ, కన్నడ, తమిళం, తెలుగు, అస్సామీ, పంజాబీ, ఇంగ్లీష్ లాంటి 10 భారతీయ భాషల్లో ఈ ఫీచర్‌ని ప్రారంభించిన మొదటి, ఏకైక ప్లాట్‌ఫాం కూ.
ఈసందర్భంగా కూ (Koo) సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా మాట్లాడుతూ… 10 భారతీయ భాషల్లో టాపిక్‌లను ప్రారంభించిన మొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం గా తాము గర్విస్తున్నామన్నారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు ఆసక్తి ఉన్న కంటెంట్‌ను కనుగొనవచ్చునన్నారు. సంబంధిత యూజర్ల ద్వారా చాలా మంది క్రియేటర్‌లను కనుగొనడంలో కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందన్నారు. తాము ప్రతి నెలా 20 లక్షలకు పైగా టాపిక్‌లను అనుసరిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ప్రతి నెలా 100 మిలియన్లకు పైగా ఈ టాపిక్ ఫీచర్ వినియోగం పెరుగుతుందని తాను అంచనా వేస్తున్నానన్నారు. భవిష్యత్తులో 100 లక్షల డౌన్లోడ్ లను సాధించాలని, ప్రపంచంలోని ప్రతిచోటా స్థానికంగా మాట్లాడేవారిని శక్తివంతం చేయగల సాంకేతికతను రూపొందించాలని కూ కోరుకుంటుందన్నారు.