బిజెపిలో తనకు ప్రాధాన్యత ఇచ్చి చేరికల కమిటీలో అవకాశం ఇచ్చారని ..దాంతో నెలకు ఒక్క నేతను అయినా బిజెపీలోకి తీసుకువస్తానని ప్రకటించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడం బీజేపీకే సాధ్యం అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో మూడే నడుస్తున్నాయి, కాళ్ళు మొక్కించుకోవడం, డబ్బులు తీసుకోవడం, కేసులతో బెదిరించడం, ఇవే నడుస్తున్నాయని ఆరోపణలు చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు అభినందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement