Tuesday, November 26, 2024

నేడే కొండపల్లి పురపాలక ఎన్నికలు.. భారీ బందోబ‌స్తు ఎర్పాటు..

ఇబ్రహీంపట్నం,(ప్రభ న్యూస్‌): కొండపల్లి పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌ కు అధికారులు అన్ని ఏర్పాట్లు- పూర్తి చేశారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌ సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. సుమారు 700 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఇందులో 24 మంది అదనపు ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు ఉన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్‌ లో ఎన్నికల సిబ్బందికి ఆదివారం 142 బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ సామగ్రి పంపిణీ చేశారు. పోలింగ్‌ సిబ్బంది సామగ్రితో వారికి కేటాయించిన స్టేషన్లకు బస్సుల్లో చేరుకున్నారు.

ఎన్నికలు ప్రశాంత వాతాశరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు అధికారులు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కట్టు-దిట్టం చేశారు. పోలింగ్‌ స్టేషన్లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సాయంత్రం పోలింగ్‌ ముగిసిన తరువాత పోలీస్‌ బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌ కు తరలించనున్నారు.

కొండపల్లి పురపాలక ఎన్నికల నేపథ్యంలో 510 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు- సీఐ కె.శ్రీధర్‌ కుమార్‌ తెలిపారు. ఒక డీసీపీ పర్యవేక్షణలో ముగ్గురు ఏసీపీలు, ఎనిమిది మంది సీఐలు, 20 మంది ఎస్సైలు , కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారన్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement