Friday, November 22, 2024

TS : ప్రారంభ‌మైన కొండ‌గ‌ట్టు చిన్న హ‌నుమాన్ జ‌యంతి ఉత్స‌వాలు

తెలంగాణ‌లో ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన కొండ‌గ‌ట్లు అంజ‌న్న ఆల‌యంలో చిన్న హ‌నుమాన్ జయంతి ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో భారీ సంఖ్య‌లో స్వామివారిని భ‌క్తులు ద‌ర్శించుకోనున్నారు. అలాగే హ‌నుమాన్ దీక్షాప‌రులు కూడా భారీ సంఖ్య‌లో త‌ర‌లి రానున్నారు.

- Advertisement -

భక్తులు గుట్టపైకి చేరేందుకు రెండు బస్సులు ఉచితంగా నడపనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 24వ తేదీ వరకు ఆలయ ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు. 25 నుంచి మళ్లీయథావిథిగా కొనసాగుతాయని చెప్పారు.

హనుమాన్‌ మాల విరమణ చేయించేందుకు 300 మంది అర్చకులు, తలనీలాలు తీసేందుకు 15 వందల మంది నాయీబ్రహ్మణులు అందుబాటులో ఉంటారని ఆలయ ఈవో తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా 900 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు.

వేకువ జాము నుంచే భక్తుల రాకతో రామ నామ స్మరణతో కొండగట్టు పరిసరాలు మారుమోగుతున్నాయి.. ఉదయం నుంచి 10 వేల మందికిపైగా దీక్షాపరులు మాల విరమణ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 24 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. హనుమన్‌ జయంతి సందర్భంగా అర్జిత సేవలు, వాహన పూజలు రద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement