Monday, November 18, 2024

TG | కొణతం దిలీప్ అరెస్ట్.. కేటీఆర్ ఫైర్ !

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి కొణ‌తం దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారన్న ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, కొణతం దిలీప్ అరెస్టుపై కేటీఆర్ స్పందించారు. “ప్రశ్నిస్తే సంకెళ్లు.. నిలదీస్తే అరెస్టులు.. నియంత రాజ్యమిది… నిజాం రాజ్యాంగమిది” అంటూ ఎక్స్ వేదిక‌గా రాసుకొచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ ని అరెస్ట్ చేశారని ఆరోపించారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

అక్రమ అరెస్టులతో ఎన్నాళ్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్య ప్రేమికులం… ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని.. అక్రమ అరెస్టులకో… ఉడత బెదిరింపులకో భయపడేది లేదని పేర్కొన్నారు. ఈ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ అని ఖండించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement