తెలంగాణలో నూతన రేషన్ కార్డులు ఇవ్వడం పాటు రేషన్ పంపిణీలో కొత్త సంస్కరణలు తీసుకురావాలని సీఎం కేసీఆర్ కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రంలో ఒక్క రూపాయికి కిలో బియ్యం ఇస్తున్న వాటిని తీసుకోవడంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. 6 కిలోల బియ్యం తీసుకోవడానికి రవాణాతో కలిపి 20 రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని వివరించారు. కాబట్టి ఏపీలో చేపట్టిన ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ విజయవంతం అయ్యిందని తెలిపారు. దానిని మోడల్‌గా తీసుకుని ఇంటింటికి రేషన్ సరుకులు సరఫరా చేయాలని సూచించారు. సివిల్ సప్లై శాఖ వాలంటీర్లను నియమించి ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తే రేషన్ కార్డుదారులకు ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement