ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : రాష్ట్రంలో రుణమాఫీ కాని అర్హత గల రైతులకు వారం రోజుల్లోగా రుణమాఫీ ఇస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ మండలం అర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు తరువాత మూడు రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించడానికే రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
పక్క రాష్ట్రం నుంచి ధాన్యం రాకుండా చర్యలు
పక్క రాష్ట్రం నుండి జిల్లాలోకి ధాన్యం రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్‌కు మొదట సోనియా గాంధీ ఒప్పుకోలేదని.. వైఎస్సార్ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు చేసి,ఆ తర్వాత ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ విధానంగా మారేందుకు దోహదపడ్డారని మంత్రి కోమటి రెడ్డి గుర్తు చేశారు. తన ఉసురు, ప్రజల ఉసురు తగిలి బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిందని మంత్రి పేర్కొన్నారు.