ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ – ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. 7 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో స్టేడియం సిబ్బంది పిచ్‌పై కవర్స్‌తో కప్పి ఉంచారు. మరికొద్ది సేపట్లో టాస్ పడే అవకాశం ఉంది.
వరుస విజయాలతో జోరుమీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్…. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కోల్‌కతా ఉంది. ఇక ముంబై ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచి, 8 మ్యాచుల్లో పరాజయం చవిచూసింది. దీంతో ముంబై నాకౌట్ ఆశలకు తెరపడింది. కోల్‌కతా మాత్రం 11 మ్యాచుల్లో 8 గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే నైట్‌రైడర్స్ అధికారికంగా ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంటుంది.