Tuesday, November 26, 2024

దేశంలో ఫ‌స్ట్ అండ‌ర్ వాట‌ర్ మెట్రో జ‌ర్నీ.. కోల్‌క‌తా సాల్ట్ లేక్‌లో జ‌రుగుతున్న ప‌నులు

దేశంలోని మొట్టమొదటి అండర్ వాట‌ర్ మెట్రో రైల్ కోల్‌క‌తాలో త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానుంది. దీంతో ప్రయాణికులు మునుపెన్నడూ లేని హ్యాపీనెస్‌, సంతోష‌క‌ర‌మైన‌ ప్ర‌యాణ‌ అనుభూతిని పొందుతారు. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (KMRC) ఆధ్వర్యంలో ఈస్ట్-వెస్ట్ కారిడార్ లో ఈ నిర్మాణం జ‌రుగుతోంది. ఈ ప్రాజెక్ట్ జూన్ 2023 నాటికి పూర్తయ్యే చాన్స్‌ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

హుగ్లీ నది దిగువన కోల్‌కతా మీదుగా సాల్ట్ లేక్ నుండి హౌరాకు అనుసంధానం చేసే మెట్రో లైన్ గా ఇది ఉండ‌బోతోంది. ప్రస్తుతం సెక్టార్ V, సీల్దా స్టేషన్‌ల మధ్య నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడం వల్ల లక్షలాది మంది ప్రయాణికులకు పెద్ద రిలీఫ్ క‌ల‌గ‌నుంది. ఇది రద్దీగా ఉండే హౌరా, సీల్దా రైల్వే స్టేషన్‌లతో పాటు కోల్‌కతా మెట్రో, నార్త్-సౌత్ లైన్‌ను ఎస్ప్లానేడ్ వద్ద ఇది కలుపుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement