Friday, November 22, 2024

శార్దూల్‌ను కొలుగోలు చేసిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

ఐపిఎల్‌ 16వ సీజన్‌ త్వరలో మొదలు కానుంది. దాంతో అన్ని జట్లు ముఖ్యమైన ఆటగాళ్లను అట్టి పెట్టుకుని, మిగతావాళ్లను వదులుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కేకేఆర్‌ ట్రేడ్‌ ఒప్పందంలో ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంది. ఈ క్రమంలోనే కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ (కెకెఆర్‌) జట్టు తమ బౌలింగ్‌ విభాగాన్ని పటిష్టం చేసుకునేందుకు ఢిల్లి క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ నుంచి ఆల్‌ రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ని కొనుగోలు చేసింది. పోయిన ఏడాది వేలంలో శార్దూల్‌ని రూ 10.75 కోట్లకు ఢిల్లి క్యాపిటల్స్‌ దక్కించుకుంది. అయితే ఆశించినంతగా రాణించకపోవడంతో ఢిల్లి జట్టు అతడిని వదులుకునేందుకు సిద్దమైంది. శార్దూల్‌ని అమ్మేయడంతో ఢిల్లి క్యాపిటల్స్‌ మూడో విడత ట్రేడ్‌ ఒప్పందాన్ని పూర్తి చేసుకుంది. కెకెఆర్‌ ట్రేడ్‌ ఒప్పందంలో భాగంగా శార్దూల్‌తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

- Advertisement -

గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు నుంచి ఆల్‌ రౌండర్‌ ల్యూక్‌ ఫెర్గూసన్‌, రహమనుల్లా గుర్బాజ్‌లను తీసుకుంది. నవంబర్‌ 15 ఆఖరు తేదీ కావడంతో అన్ని జట్లు ఇప్పటికే కొందరు ఆటగాళ్లలలను ఇతర జట్లకు అమ్మేశాయి. చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడిన శార్దూల్‌ అద్భుత ప్రదర్శన చేసి , భారత జట్టులో చోటు సంపాదించాడు. లార్డ్స్‌ టెస్ట్‌లో వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. దాంతో 2022 ఐపీఎల్‌ వేలంలో పది కోట్లకు పైగా చెల్లించి ఢిల్లి క్యాపిటల్స్‌ అతడిని సొంతం చేసుకుంది. అయితే శార్దూల్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. 14 మ్యాచుల్లో 120 పరుగులు మాత్రమే తీశాడు. బౌలింగ్‌లో 9.79 సగటుతో 15 వికెట్లు తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement