ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూఢిల్లీ : కోల్ కతా ఆర్ జీ కర్ హాస్పిటల్ లో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. కోలకతా డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనపై ద్రౌపది ముర్ము తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి అత్యంత క్రూరమైన దాడి.. భయభ్రాంతులకు గురిచే సిం ది.. ఇలాంటి ఆకృత్యాలను ఏ నాగరిక సమాజం సహించదని రాష్ట్రపతి బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నిర్భయ మాదిరిగానే…
ఢిల్లీలో నిర్భయ మాదిరిగానే కోలకతా లో మరో అత్యంత దారుణమైన, హేయమైన చర్య మరోసారి జరిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్, మహారాష్ట్ర చిన్నారులపై అత్యాచారం, మలయాళ చిత్ర పరిశ్రమలోని నటులు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సహా మహిళలపై హింసాత్మక నేరాలకు సంబంధించిన ఇటీవల జరిగిన భయంకరమైన సంఘటనలకు సంబంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్లాగ్ చేశారు.