Friday, November 22, 2024

Karnataka | మళ్లీ తెరుచుకోనున్న కోలార్ గ‌నులు..

దేశంలోనే బంగారు గనులకు కర్ణాటకలోని కోలారు ప్రసిద్ధి చెందింది. కాగా, దశాబ్దాలుగా మూతపడిన కోలారు బంగారు గనుల్లో (కేజీఎఫ్‌) తవ్వకాలను పునఃప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. క్యాబినెట్ భేటీల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేజీఎఫ్‌లో మళ్లీ తవ్వకాలను ప్రారంభించాలని కేంద్రం చేసిన ప్రతిపాదనలకు సిద్ధ రామయ్య సర్కారు ఆమోదం తెలిపింది.

మళ్లీ తవ్వకాలు చేపడితే కేంద్రంతో పాటు రాష్ట్రానికి ఆదాయం దండిగా వస్తుంది. ఈ నేపథ్యంలో కోలారు, బంగారుపేటె, బంగారదిన్ని పరిసరాల్లో కనీసం 5,213 హెక్టార్ల గనుల్లో తవ్వకాలు చేపట్టనున్నారు. ఈ బాధ్యతను భారత్‌ గోల్డ్‌మైన్‌ లిమిటెడ్‌ (బీజీఎంఎల్‌)కు మరోసారి కట్టబెట్టారు. కోలార్ జిల్లాలోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న 13 టెయిలింగ్ డంప్‌లలో కార్యకలాపాల కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కర్ణాటక ప్రభుత్వం.. అదే సమయంలో బీజీఎల్‌కు చెందిన 2,330 ఎకరాలను ప్రతిపాదిత పారిశ్రామిక టౌన్‌షిప్‌‌కు బదిలీ చేయాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement