Monday, January 27, 2025

Tilak Varma | కోహ్లీ రికార్డు బ్రేక్.. తిల‌క్ వర్మ న‌యా ఫీట్ !

టీమిండియా యువ బ్యాట్స్‌మెన్, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వరుసగా నాలుగు టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ (258) పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. నాలుగు ఇన్నింగ్స్ లో (107,120,19,72) 318 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.

అంతేకాకుండా తిలక్ వర్మ గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, ఈరోజు శనివారం చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ201లో తిలక్ వర్మ ఈ చారిత్రాత్మక ఫీట్ సాధించాడు.

వ‌రుస‌గా నాలుగు T20I ఇన్నింగ్స్‌లలో సాధించిన పరుగులు చేసిన వారి జాబితా

  • తిల‌క్ వ‌ర్మ – 318 ప‌రుగులు
  • విరాట్ కోహ్లి 258 ప‌రుగులు
  • సంజూ శాంసన్ – 257 ప‌రుగులు
  • రోహిత్ శర్మ – 253 ప‌రుగులు
  • శిఖర్ ధావన్ 252 ప‌రుగులు

Advertisement

తాజా వార్తలు

Advertisement