ఐపీఎల్ 2023.. 16వ సీజన్లో భాగంగా ఇవ్వాల రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగగా.. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో బెంగళూరు అద్బుతమైన విజయం సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా.. మెదట బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసి బెంగళూరు ముందు 187 పరుగుల టార్గెట్ ని సెట్ చేయగలిగింది.
ఇక చేజింగ్ కి వచ్చిన బెంగళూరు ఓపనెర్లు తమ పవర్ హిట్టింగ్ తో 18వ ఓవర్ వరకు ఒక్క వికెట్ పడకుండా ఆడారు.. మొదటి బాల్ నుంచే అగ్రెసివ్ గా ఆడిన కోహ్లీ 63 బంతుల్లో 100 పరుగుల(12 ఫోర్లు, 6 సిక్స్ లు)తో సెంచరీ చేశడు. కప్టెన్ ఫాప్ డూప్లెసిస్ కూడా కన్సిస్టెన్సీ తో ఆడుతూ 47 బంతుల్లో 71 పరుగుల(7 ఫోర్లు, 2 సిక్స్ లు) తో అర్థ శతకం పూర్తి చేశాడు. వీరిద్దరి పార్టనర్ ఫిప్ లో 172 పరుగులు చేశారు.
ఇక చివరిలో వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ 3 బంతుల్లో 5 పరుగులు, మైఖేల్ బ్రేస్‌వెల్ 4 బంతుల్లో 4 పరుగులతో మిగిలిన రన్స్ ని చేజ్ చేశారు. దీంతో నిర్ణీత 120 బంతుల్లో 2 వికెట్ల నష్టానికి 187 పరుగుల టార్గెట్ ని ఈజీ గా చేజ్ చేసి హైదరాబాద్ పై అద్బుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ గెలవడంతో పాయింట్స్ టేబుల్ లో ముంబైని కిందకి తోసి.. నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది.