టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కోల్‌కతా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, ఈ మ్యాచ్‌లో కోహ్లీ విజృంభించాడు.. 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 (నాటౌట్) ఒంటరిపోరాంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ స్కోర్‌ను అందించారు. ఇక కెమెరాన్ గ్రీన్ (33), గ్లెన్ మాక్స్వెల్ (28), దినేష్ కార్తీక్ (20) జట్టుకు మరిన్ని పరుగులు సాధించారు. ఫలితంగా బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
ఇక కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రానా, ఆండ్రీ రస్సెల్ చెరో రెండు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. కాగా, 183 పరుగుల టార్గెట్‌తో కోల్‌కతా చేజింగ్‌కు దిగనుంది.