ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవ్వాల కోల్‌కతా వేదికగి జరుగుతున్న భారత్– సౌతాఫ్రికా మ్యాచ్ లో.. ముందుగా టాస్ గెలిచి బ్యాటించ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. దీంతో రసౌతాఫ్రికా ముందు 327 పరుగుల భారీ టార్గెట్‌ని సెట్ చేయగలిగింది.
ఇక ఈ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. తన పుట్టిన రోజున ఫ్యాన్స్ కు మంచి గిఫ్ట్ అందించాడు. వన్డేల్లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కింగ్ కోహ్లీ సమం చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 121 బంతుల్లో 101 పరుగులతో (నాటౌట్) కదం తొక్కాడు.
ఇక, విరాట్ కోహ్లీ సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ (77) పరుగులు జోడించడంతో టీమిండాయా స్కోర్ భారీగా వెల్లింది. ఆరంభంలో రోహిత్ శర్మ (40) ధాటిగా ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, షమ్సీ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.