ఢిల్లి టెస్ట్‌లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనతను సాధించాడు. కింగ్ కోహ్లీ 25,000 పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. అంతేకాక క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్‌మెన్‌గా, రెండో భారతీయుడిగా నిలిచాడు.
ఢిల్లి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో మూడో రోజు విరాట్ కోహ్లీ అద్భుతం చేశాడు. ఈ టెస్టులో (44,20) పరుటులు చేసిన కోహ్లీ ఎందరో దిగ్గజ క్రికెటర్లు కూడా సాధించలేని అరుదైన ఘనతను అందుకుని సచిన్ టెండూల్కర్ , రిక్కీ పాంటింగ్ వంటి వారి సరసన చేరాడు. అదేమిటంటే అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ 25 వేల పరుగులు పూర్తి చేశాడు.
అంతే కాక ఈ ఘనత సాధించిన రెండో టీమిండియా బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. అంతేకాక ప్రపంచ క్రికెట్‌లో 25,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా కూడా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ (577 ఇన్నింగ్స్), రికీ పాంటిం గ్ (588 ఇన్నింగ్స్, కుమార సంగక్కర (608 ఇన్నింగ్స్ ), మహేల జయవర్దనే(701 ఇన్నింగ్స్) కూడా ఈ ఘనతను సాధించారు.
ఇక భారత్ తరపున కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను సాధించాడు. అయితే సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 2500 చేయడానికి 577 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. మరో వైపు ఈ ఘనతను సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ(548 ఇన్నింగ్స్) ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉండగా సచిన్ (577) రెండో స్థానంలో, రిక్కీ పాంటింగ్ (588) మూడో స్థానంలో ఉన్నారు. ఫలితంగా 25000 పరుగులు సాధించినన క్రికెటర్ల ఎలైట్ గ్రూప్‌లో కూడా కోహ్లీ ప్రథమ స్థానంలో ఉన్నట్లయ్యింది.