విరాట్ కోహ్లీని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దని, అతనితో ఆట అంటే మామూలుగా ఉండదని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్. కానీ, ఎందుకో ఈ మధ్య విమర్శలు ఎదుర్కొంటున్నట్టు తెలిపాడు. అతను మళ్లీ గ్రౌండ్లోకి వచ్చే శక్తని తిరిగి తెచ్చుకుంటాడు. క్రికెట్ అంటే అతని ఎంత నిబద్ధత ఉందో అతని ఆటతీరును బట్టి అంచనా వేయొచ్చు అన్నాడు ఈ స్టార్ ప్లేయర్.
వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బెన్ స్టోక్స్ కోహ్లీ ఆల్ రౌండర్ ప్రతిభ గురించి పొగడ్తల వర్షం కురిపించాడు. “చూడండి, విరాట్ మూడు ఫార్మాట్లలో ఆడగల గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా ఉంటాడు. అతను ఒక అద్భుతమైన ఆటగాడు. అతనిలాంటి గొప్ప ప్లేయర్లతో కలిసి మైదానంలో దిగిన ప్రతిసారీ నేను ఎంతో గౌరవిస్తాను, అతని ఆటతీరును కూడా అంతే ఇష్టపడతాను” అని స్టోక్స్ మీడియాకు తెలిపాడు.
అయితే.. అతనితో కలిసి ఆడటం ప్రారంభించక ముందే నేను అతని ఆటతీరును మెచ్చుకున్నాను. మీరు అలాంటి కుర్రాళ్లతో ఆడడాన్ని ఇష్టపడతారు. అయితే నాకూ అతనితో కలిసి అత్యున్నత స్థాయిలో ఆడే అదృష్టం కలిగింది. అన్నాడు స్టోక్స్. కాగా, “మనకు మైదానంలో మరికొన్ని వార్లు ఉంటాయని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. అని కోహ్లీ నాతో చెప్పడం వినడానికి సంతోషంగా అనిపించింది” అని స్టోక్స్ చెప్పాడు. ఇప్పటికే కోహ్లీ ఖాతాలో 70అంతర్జాతీయ సెంచరీలున్నాయని.. ఇది అందరికీ సాధ్యం కాదని చెప్పుకొచ్చాడు ఇంగ్లండ్ బ్యాట్స్మన్.
కాగా, 2019 నవంబర్ నుండి కోహ్లీ సెంచరీ చేయలేదు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో కూడా అతను పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు.. జులై 22 నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్ సిరీస్ లోనూ కోహ్లీకి చాన్స్ ఇవ్వకుండా బీసీసీఐ రెస్ట్ తీసుకోవాలని సూచించింది.