Friday, November 22, 2024

కోహ్లీ అరుదైన ఘనత

టీమ్‌ ఇండియా స్టార్‌ ప్లేయర్స్‌ విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ మరో అరుదైన ఘనత సాధించారు. పురుషుల టీ 20 ప్రపంచకప్‌ 2022లో ఐసీసీ ప్రకటించిన అత్యంత విలువైన ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ ఈ జాబితాలో ముందు వరసలో ఉన్నాడు. రెండు టీ 20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ సెమీ ఫైనల్‌లోనే నిష్క్రమించినప్పటికీ విరాట్‌ కోహ్లీ మాత్రం టాప్‌ స్కోరర్‌గా టోర్నీని ముగించాడు.

ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ శతకాలు ఉండడం గమనార్హం. ఇందులో పాకిస్థాన్‌పై నమోదు చేసిన 82 (నాటౌట్‌) కూడా ఉన్నాయి. 2014లో జరిగిన టీ 20 వరల్డ్‌ కప్‌లో కూడా విరాట్‌ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 106.33 పరుగులు చేశారు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ 20 ప్రపంచకప్‌లలో కలిసి అత్యధిక రన్స్‌ చేసిన ఆటగాడు కూడా కోహ్లీయే కావడం విశేషం. మొత్తం 27 మ్యాచ్‌ల్లో 1, 141 పరుగులు చేశాడు. 81.50 సగటు నమోదు చేశాడు. ఇందులో 14 అర్థ శతకాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ ఘనత శ్రీలంక మాజీ క్రికెటర్‌ జయవర్దనే పేరుతో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement