Tuesday, November 26, 2024

కెప్టెన్​ రోహిత్​ గ్రేట్​ రికార్డు.. టీ20లో 300 ఫోర్లు కొట్టిన తొలి బ్యాట్స్​మన్​గా గుర్తింపు!

IND VS ENG: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన 2వ T20Iలో రోహిత్ శర్మ ఒక ప్రత్యేకమైన మైలురాయిని సాధించాడు. టీ20ల్లో 300 ఫోర్లు కొట్టిన తొలి భారతీయుడిగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓడించాడు. అయితే.. రోహిత్ 20 బంతుల్లో 31 పరుగులు మాత్రము చేసి ఈ మ్యాచ్​లో అవుటయ్యాడు.

అంతర్జాతీయ స్థాయి టీ20 ఫార్మాట్‌లో 300 బౌండరీలు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త రికార్డు సృష్టించాడు. ఐరిష్‌ బ్యాటర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో ఈ మైలురాయిని సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్ ఇద్దరూ 298 ఫోర్లు కొట్టి ఉన్నారు.

అయితే.. ఈ మైలురాయిని సాధించిన మొదటి భారతీయులుగా నిలిచేందుకు వారిద్దరూ ఇవ్వాల పోటీ పడ్డారనే చెప్పవచ్చు. కాగా, ఓపెనింగ్ బ్యాట్స్​మన్​ రోహిత్ ఈ రేసులో గెలిచే చాన్స్​ దక్కింది. అతను ఇవ్వాల్టి మ్యాచ్​లో రెండు బౌండరీలు కొట్టి టీ20లో 300 ఫోర్లు కొట్టిన మొదటి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. అయితే.. ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ 20 బంతుల్లో 31 పరుగులతో మెన్ ఇన్ బ్లూకు వేగవంతమైన ప్రారంభాన్ని అందించాడు. కాగా, 3 బంతుల్లో కేవలం ఒక్క పరుగు చేసిన కోహ్లి మైలురాయిని పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌కు చెందిన 34 ఏళ్ల అరంగేట్ర ఆటగాడు రిచర్డ్ గ్లీసన్ రోహిత్, కోహ్లీ ఇద్దరినీ అవుట్ చేశాడు. గ్లీసన్ తన 26పరుగుల సమయంలో మంచి ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ వికెట్ కూడా తీశాడు.   

Advertisement

తాజా వార్తలు

Advertisement