Tuesday, November 26, 2024

కొడియాక్​ ఎస్​యూవీ.. స్కోడా కొత్త మోడల్​..

ఔరంగాబాద్‌లోని తమ తయారీ కేంద్రంలో కొత్త వెర్షన్‌ ఎస్‌యూవీ కొడియాక్‌ తయారీని ప్రారంభిస్తున్నట్టు స్కోడా ఆటో ప్రకటించింది. ఎంక్యూబీ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన ఈ మోడల్‌.. భద్రత, డ్రైవింగ్‌ డైనమిక్స్‌, సౌలభ్యంతో పాటు సాంకేతికత బలాన్ని మరింత పెంపొందిస్తుందని వాహన తయారీదారు స్కోడా ఆటో తెలిపింది. స్కోడా ఆటో ఫోక్స్‌ వ్యాగన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ గురుప్రతాప్‌ బొపరాయ్‌ మాట్లాడుతూ.. కొత్త కొడియాక్‌ భారతదేశంలో గ్రూప్‌ మొత్తం ఎస్‌యూవీ ఎంతో ఆకర్శనీయమైందన్నారు. ఔరంగాబాద్లోని తమ ప్లాంట్‌లో తయారు చేయడం జరుగుతుందని వివరించారు. భారతీయ కస్టమర్‌కు అత్యుత్తమ సాంకేతికత, భద్రతను అందిస్తుందన్నారు. విలాసవంతమైన ఎస్‌యూవీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఎంతో నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.

భారతీయ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు.. ఈ మోడల్‌ను మరింత ఆకర్శణీయంగా తయారు చేసేందుకు శ్రమించామని వివరించారు. కొత్త కొడియాక్‌ ప్రీమియం లగ్జరీ విభాగంలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటుందని, భారతదేశంలో తమ వృద్ధి వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్కోడా ఆటో ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ జాక్‌ హోలిస్‌ మాట్లాడుతూ.. కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో ప్రవేశపెట్టిన రెండో ఎస్‌యూవీ మోడల్‌ అన్నారు. కొడియాక్‌.. అద్భుతమైన డిజైనింగ్‌ కోసం కొన్నేళ్లుగా శ్రమించినట్టు వివరించారు. అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేస్తూ వచ్చామన్నారు. భారతదేశంలోని తమ కస్టమర్‌లకు పూర్తి ఉత్పత్తిని పోర్ట్‌ఫోలియోను అందించడానికి మోడల్‌ తమ దృష్టిని మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement