కామారెడ్డి, ప్రభన్యూస్… గోదావరి జలాల కోసం జలసాధన యాత్రను కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం నాడు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి పోచారం వరకు ఈ యాత్రను చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రాణహిత, చేవెళ్ల లిఫ్టు పథకం లో భాగంగా 22 ప్యాకేజీ కింద 3450 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజెక్టు ప్రారంభించారని 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని పనులు అసంపూర్తిగా మిగిలాయన్నారు. మరో రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కామారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందనీ యాత్రను చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద మోతె, భూంపల్లి, కాటేవాడి లలో రిజర్వాయర్లు నిర్మించి కాల్వలు పూర్తిచేసి నిధులు కేటాయిస్తే వెనకబడిన బీడు వారిన కామారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పై కామారెడ్డి జిల్లా పై తెలంగాణ సర్కారు చిన్నచూపు చూస్తోందని కోదండరాం ఆరోపించారు. జల సాధన యాత్రలో నిజ్జన రమేష్, కుంబాల లక్ష్మణ్ యాదవ్, రజినీకాంత్ జిల్లా నాయకులు సంగారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ఈ ఒక్క రోజు జలసాధన యాత్ర కామారెడ్డి నుండి పోచారం వరకు కొనసాగుతుంది. యాత్ర అనంతరం పూర్తి నివేదికతో అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, నిపుణులను కలిసి విన్నవిస్తామని కోదండరామ్ చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement