Monday, November 25, 2024

వార‌స‌త్వ‌మంటే తాత‌..తండ్రి..కొడుకు – మామ‌..అల్లుడు కాదు-ఎమ్మెల్యే కొడాలి నాని

వార‌స‌త్వ‌మంటే తాత‌..తండ్రి..కొడుకు అని మామ‌..అల్లుడు కాద‌న్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. మచిలీపట్నంలో ఈ రోజు నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో వారసుడినే గెలిపించాలని… ఇల్లరికం వచ్చిన కొల్లు రవీంద్ర (టీడీపీ)ని కాదని చెప్పారు. వైసీపీ తరపున మాజీ మంత్రి పేర్ని నాని నిలబడినా, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడిగా గెలిపించాలని అన్నారు. వారసత్వం అంటే వైయస్సార్, వైయస్ జగన్ అని… సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరే అని అన్నారు. మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement