Friday, November 22, 2024

Narsingi: ప్రేమోన్మాదం.. ప్రియురాలిపై కత్తితో దాడి

ప్రియురాలిపై ఉన్మాది కత్తితో దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నార్సింగిలో చోటుచేసుకుంది. ప్రియురాలిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు ఈ ఘటన నార్సింగి గ్రిల్ ట్రీ హోటల్ దగ్గర జరిగింది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. విభేదాలు రావడంతో మాట్లాడుదామని పిలిపించాడు. అతని అభ్యర్థన మేరకు నార్సింగి గ్రిల్ ట్రీ హోటల్ దగ్గరికి రాగా, అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇంతలో ఆమె మీద కత్తితో దాడిచేశాడు ఆ ఉన్మాది. దీంతో ఆమె మెడ, చేతులపై గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement