Wednesday, November 20, 2024

చిరు మ‌న‌వ‌రాలికి ‘క్లింకారా’ గా పేరు … ప్ర‌క‌టించిన మెగాస్టార్ ..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఈనెల 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిరు ఫ్యామిలీకి ఇష్టమైన మంగళవారమే పాప జన్మించడంతో చిరంజీవి కుటుంబం సంతోషంలో మునిగిపోతున్నారు. ఇక మెగాస్టార్ ఇంట్లో నేడు బారసాల కార్యక్రమం ఘ‌నంగా నిర్వహించారు.

తన మనవరాలి పేరు తెలియజేస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్, ఉపాసన కూతురి పేరు క్లింకారా అనే పెట్టినట్లుగా తెలిపారు. క్లింకారా అంటే లలితా సహస్త్రనామాల్లో బీజాక్షరం. అర్థం ప్రకృతికి శక్తికి ప్రతిరూపం అని పేర్కొంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement