Wednesday, November 20, 2024

Asia cup | తొలి రెండు మ్యాచ్‌ల‌కు రాహుల్ దూరం.. స్వ‌ల్ప గాయమే కార‌ణం

ఆసియాకప్‌లో భాగంగా రేపు (బుధవారం) ముల్తాన్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబరు 2న క్యాండీ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. కాగా, ఆసియా కప్ లో టీమిండియా ఆడ‌నున్న‌ తొలి రెండు మ్యాచ్‌లకు భారత వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరంకానున్నాడు.

గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన రాహుల్ పాకిస్థాన్, నేపాల్‌తో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండ‌లేడని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇవ్వాల (మంగళవారం) ప్రకటించారు. అయితే, బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని.. ప్రాక్టీస్ సెషన్‌లో ప‌ర్ఫెక్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని ద్రావిడ్ తెలిపాడు.

- Advertisement -

అంతకుముందు జట్టు ప్రకటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన‌ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. రాహుల్ స్వల్ప అసౌకర్యంతో బాధపడుతున్నారని తెలిపారు. “KL మాతో మంచి వారాన్ని గడిపాడు, బాగా ఆడుతున్నాడు, బాగా పురోగమిస్తున్నాడు, కానీ క్యాండీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ్యాచ్ కు అతను అందుబాటులో ఉండడు, మేము ట్రిప్ లో ఉన్న‌ కొద్ది రోజులు NCA అతనిని చూసుకుంటుంది. ” అని ద్రవిడ్ ప్రీ-డిపార్చర్ ప్రెస్సర్‌లో చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement