టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న 11ఏళ్ల చిన్నారికి అత్యవసర వైద్యచికిత్స కోసం 31లక్షల రూపాయలు విరాళంగా అందజేశాడు. దీంతో రాహుల్‌పై సర్వత్రా ప్రశంసలు వెలువడుతున్నాయి. బెంగళూరుకు చెందిన 11ఏళ్ల వరద్ బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో హెమాటాలజిస్టుల సంరక్షణలో అతడికి చికిత్స అందిస్తున్నారు.
వరద్ ఎముక మజ్జ మార్పిడి మాత్రమే శాశ్వత నివారణ అని వైద్యులు వెల్లడించారు. క్రికెటర్ కావాలని కోరుకుంటున్న వరద్‌ను ఆదుకునేందుకు రాహుల్ ముందుకొచ్చాడు. చికిత్స అనంతరం వరద్ కోలుకుంటున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ గివ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వరద్ విషయం తెలిసింది. ఆపరేషన్ సక్సెస్ అయి కోలుకోవడం సంతోషాన్ని కలిగించిందని తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..