Friday, November 22, 2024

పంజాబ్ లక్నో vs మ్యాచ్ లో.. క్రిస్ గేల్ రికార్డ్ ని బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్

ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో ఇవ్వాల (శనివారం) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది లక్నో. మ్యాచ్ లో లక్నో టాప్ ఆర్డర్ మొత్త ఫేయిల్ అవ్వడంతో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది టీమ్. అయితే ఇందులోనే కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేసి హాఫ్ సెంచరీ బాదాడు… 56 బంతుల్లోనే ఎనిమిది 4, ఒక 6 సాయంతో 74 పరుగులు చేశాడు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో 4000 పరుగులు చేేసిన మార్క్‌ని అందుకున్న రాహుల్.

అయితే 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ప్లేయర్‌గా రాహుల్ నిలిచాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. వేగంగా 4వేల పరుగుల మార్క్‌ని అందుకున్న ప్లేయర్‌గా ఇవ్వాల్టి (శనివారం) వరకూ క్రిస్‌గేల్ ఉన్నాడు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌ టీమ్స్‌కి ఆడిన క్రిస్‌గేల్.. 112 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ని చేరుకున్నాడు. అయితే, రాహుల్ మాత్రం కేవలం 105 ఇన్నింగ్స్‌ల్లోనే 4వేల పరుగుల మార్క కి చేరుకుని గేల్ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement