Friday, October 18, 2024

21 పరుగుల తేడాతో అర్ సి బి పై కె కె ఆర్ విజయం

బెంగళూరుపై 21 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. 201 పరుగులు విజయలక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేయగలిగింది. మొదట్లో దూకుడుగా ఆడిన బెంగళూరుకు కోల్‌కతా బౌలర్లు ముచ్చెమటలు పట్టించారు. వరుసగా వికెట్లు తీసి బెంగళూరును కోలుకోలేకుండా చేశారు. దీంతో 179 పరుగులు మాత్రమే చేయగలిగింది..అర్ సి బి బాటర్లలో కోహ్లీ 54 , మహిపాల్‌ లోమ్రోర్‌ 34 పరుగులు చేశారు .. మిగిలిన బాటర్స్ విఫలం కావడం తో కొల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఆర్ సి బి కి మరో ఓటమి తప్పలేదు. ఆర్ సి బి బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీసుకోగా, సయేష్, రస్సెల్ రెండేసి వికెట్లు సాధించారు.

అంతకు ముందు బెంగుళూరు – స్వంత మైదానంలో ఆడుతున్న ఆర్సీబి కి కోల్ కోత నైట్ రైడ‌ర్స్ భారీ టార్గెట్ ముందుంచింది.. నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో కెకెఆర్ 5 వికెట్లు న‌ష్టపోయి 200 ప‌రుగులు చేసింది.. ఇక గెలుపు కోసం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ 201 ప‌రుగులు చేయాల్సి ఉంది. అయితే 179 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో RCB ఓటమి పాలైంది… కెకెఆర్ బ్యాటింగ్ లో జాస‌న్ రాయ్, నితీష్ రానాలు అద‌ర‌గొట్టారు. ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. కేకేఆర్‌ టీమ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెకెఆర్ ఓపెన‌ర్ లు జాస‌న్ రాయ్ , జ‌గ‌దీశ‌న్ లు నిల‌క‌డ‌గా బ్యాటింగ్ చేశారు.. 10 ఓవ‌ర్ల వ‌ర‌కు వికెట్ ప‌డ‌కుండా మెరుపు వేగంతో ప‌రుగులు సాధించారు.. ఇక 10వ ఓవర్‌ రెండో బంతికి తొలి వికెట్‌ కోల్పోయింది. ఎన్‌ జగదీశన్‌ విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ బౌలింగ్‌లో విల్లేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అప్పటికి జగదీశన్‌ 29 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అలాగే ఇదే ఓవ‌ర్ లో వైశాక్ మ‌రో దెబ్బ‌దీశాడు.. భారీ హిట్టింగ్ తో చెల‌రేగుతున్న జాస‌న్ రాయ్ హిట్ వికెట్ గా వైశాక్ బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరాడు..జాస‌న్ 29 బంతుల‌లో 56 ప‌రుగులు చేశాడు.. ఇక నితీష్ రానా కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు.. కేవ‌లం 21 బంతుల‌లో 46 ప‌రుగులు చేసి డి సిల్వా బౌలింగ్ లో అవుట‌య్యాడు..దీంతో కెకెఆర్ మూడో వికెట్ కోల్పోయింది.. ఈ ఓవ‌ర్ లోనే వెంక‌టేష్ అయ్యర్ 31 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద డిసిల్వా బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరాడు..ఇక ర‌స్సెల్ ఒక ప‌రుగుకి సిరాజ్ బౌలింగ్ లో ఔట‌య్యాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement