ఐపీఎల్ 2024లో నేడు (మంగళవారం) కోల్‌కతా నైట్ రైడర్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలచిన రాజస్థాన్… కోల్‌కతా ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈమ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.
పాయింట్ల రాజస్థాన్, కోల్‌కతా జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.. కాగా, ఇప్పటివరకు ఐపీఎల్‌లో 27 సార్లు తలపడగా.. అందులో కోల్‌కతా 14, రాజస్థాన్ 13 మ్యాచుల్లో గెలిచాయి. ఇక నేటి మ్యాచ్ టేబుల్ టాపర్ ల మధ్య మ్యాచ్ కావడంతో హై వోల్టేజ్ మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ఖచ్చితంగా.. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటారు.
తుది జట్లు :
రాజస్థాన్ రాయల్స్ :
యశస్వి జైస్వాల్, రోవ్‌మన్ పావెల్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్.
కోల్‌కతా నైట్ రైడర్స్ :
ఫిలిప్ సాల్ట్ (WK), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్, వరుణ్ చకరవర్తి.
విజయమే లక్ష్యంగా రాజస్థాన్..
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇరు జట్లు సూపర్ ఫామ్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనుకుంటోంది రాజస్థాన్ జట్టు. ఇటు కోల్‌కతా, అటు రాజస్థాన్ జట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్ సమతూకంగా ఉంది. కెప్టెన్ సంజు శాంసన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్ తదితరులతో జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. శాంసన్, బట్లర్, పరాగ్, యశస్వి తదితరులు చెలరేగితే రాజస్థాన్‌కు ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరు ఖాయం. అంతేగాక బౌల్ట్, అవేశ్ ఖాన్, కేశవ్ మహారాజ్, చాహల్, అశ్విన్‌లతో రాజస్థాన్ బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో రాజస్థాన్ కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది.
ఫేవరెట్‌గా నైట్‌రైడర్స్..
ఆతిథ్య కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తన టేబుల్ పాపర్‌గా అవతరించాలనే తపనతో బరిలోకి దిగుతోంది. సాల్ట్, నరైన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రసెల్, రింకు సింగ్, రమన్‌దీప్ సింగ్ తదితరులతో కోల్‌కతా బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక బౌలింగ్‌లోనూ జట్టు పటిష్టంగా ఉంది. స్టార్క్, వరుణ్, రసెల్, నరైన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు.