ఐపీఎల్లో ఇప్పటికే జరిమానాలు పడ్డ కెప్టెన్ల జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ కూడా చేరాడు. అసలే బుధవారం నాటి మ్యాచ్‌లో ఓటమి పాలయ్యామనే బాధలో ఉన్న KKR టీమ్‌కు మరో దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌ను కేకేఆర్ టీమ్ నిర్ణీత సమయం లోపు ముగించలేకపోయింది. దీంతో ఐపీఎల్ నిబంధనలు ప్రకారం స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్ మోర్గాన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఇది తొలిసారి కాబట్టి కేవలం జరిమానాతో సరిపెట్టారు. టోర్నీలో మరోసారి రిపీట్ అయితే జరిమానా రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మలకు స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా పడిన సంగతి తెలిసిందే. కాగా బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం గంటకు 14.1 ఓవర్లు పూర్తి చేయాలి. అలాగే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇందులో స్ట్రాటజిక్ టైమ్ ఔట్స్, అనూహ్య అంతరాయాల సమయాన్ని మినహాయిస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement