బెంగుళూరు: న్యూజీల్యాండ్ తో బెంగుళూరు లో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియన్ బ్యాటింగ్ లైనప్ అట్టర్ ప్లాప్ అయ్యింది. న్యూజిలాండ్ బౌలర్ల దూకుడు ముందు.. భారత బ్యాటర్లు చేతులెల్తేశారు. తొలి రోజు వర్షం వల్ల ఆట రద్దు కాగా, ఇవాళ రెండో రోజు ఉదయం టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నది. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ఇండియన్ బ్యాటర్లు త్వరత్వరగా పెవిలియన్ చేరుకున్నారు. కేవలం 46 పరుగులకే ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకోగా, రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇండియన్ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ అత్యధికంగా 20 పరుగులు చేయగా, అయిదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. కోహ్లీ, సర్ఫరాజ్, జడేజా, కేఎల్ రాహుల్, అశ్విన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. స్వంత గడ్డపై భారత్ జట్టు ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో అతి తక్కువ పరుగులకు ఔట్ కావడం గమనార్హం.