అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ దక్కించుకున్నాడు. డిసెంబర్ నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా అజాజ్ నిలిచాడు. ఈ పురస్కారానికి టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో అజాజ్ పోటీపడ్డాడు. అయితే ఈ పురస్కారం అజాజ్‌కే దక్కింది.
ఇది కూడా చదవండి : ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు చార్జీల బాదుడు.. నగదు విత్ డ్రా చేసినా.. ఆలస్యంగా బిల్లు చెల్లించినా.. ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి..
గత నెలలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో భారత సంతతికి చెందిన అజాజ్ బంతితో అద్భుతాన్ని పునరావృత్తం చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో టీమిండియా మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఒకే ఇన్నింగ్స్‌లో 10వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా జిమ్‌లేకర్, అనిల్‌కుంబ్లే సరసన చేరాడు. కాగా డిసెంబర్లో ఒకే టెస్టు ఆడిన అజాజ్ 14వికెట్లు పడగొట్టాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital