బ్లాక్ ఫంగస్‌కు వాడే ఔషధాల కొరత ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఈ రోజు హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిని సందర్శించి, అక్కడ బ్లాక్ ఫంగస్ రోగులకు అందుతోన్న చికిత్సపై ఆరా తీశారు కిషన్ రెడ్డి. బ్లాక్ ఫంగస్ బాధితులను పరామర్శించారు. కొవిడ్-19 సోకి కోలుకున్న మధుమేహ రోగుల్లోనే బ్లాక్‌ఫంగస్ సమస్య తలెత్తుతోందని తెలిపారు. బ్లాక్ ఫంగస్‌కు వాడే ఔషధాల కొరత ఉన్న మాట వాస్తవమేనని కిషన్ రెడ్డి చెప్పారు. ఔషధాల ఉత్పత్తి గురించి 11 సంస్థలతో చర్చించామని పేర్కొన్నారు. ఇన్నాళ్లు బ్లాక్ ఫంగస్ కేసులు చాలా అరుదుగా వచ్చేవని, అందుకే దేశంలో దాని ఔషధాల కొరత ఉందని తెలిపారు.
కొన్ని రోజులుగా కరోనా రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. అవసరమైన ఔషధాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని తెలిపారు. దేశంలోనూ ఔషధాల ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
బ్లాక్ ఫంగస్‌కు వాడే ఔషధాల కొరత ఉన్న మాట వాస్తవమే: కిషన్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement