Tuesday, December 3, 2024

TG | కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలి : సీఎం రేవంత్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ మండిపడ్డారు. హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ… కేంద్ర కేబినెట్ నుంచి తెలంగాణకు కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు

హైదరాబాద్ అభివృద్ధికి మెట్రో విస్తరణ, మూసీ నది సుందరీకరణకు కలిపి రూ.70వేల కోట్లు కావాలని, వాటి కోసం కిషన్ రెడ్డి ఏం చేస్తారని ప్రశ్నించారు. మెట్రో విస్తరణపై బీజేపీ విధానమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్ మెట్రోకు, చెన్నైకి మెట్రోకు నిధులు ఇచ్చారు.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు ఇవ్వరు..? అని ప్ర‌శ్నించారు.

అయితే, హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడాలంటే లక్షన్న‌ర కోట్లతో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దాంతో హైదరాబాద్ అద్భుతమైన నగరంగా మారుతుందని… ఫ్యూచర్ సిటీ కోసం మరో 15 వేల ఎకరాల భూమి అవసరమని.. అందుకు రైతులు సహకరించి భూములు ఇవ్వాలన్నారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలకు పోటీగా ఫ్యూచర్ సిటీని కడతామన్నారు. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ వేదిక కావాలంటే ఈ పనులన్నీ జరగక తప్పదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement