తెలంగాణ రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ని గద్దె దించడానికి అందరూ కలిసి రావాలని నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికి పార్టీని బలోపేతం చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. ఈటెల రాజేందర్ ఢిల్లీలో బిజెపి నాయకులను కలుస్తారని… బండి సంజయ్ నాతో చర్చించిన తర్వాతే ఈటెల ఢిల్లీ వెళ్లారని అన్నారు.
పార్టీ లో ప్రస్తుతం సానుకూల వాతావరణం ఉంది. పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలి. అసంతృప్తులు సహజం గా ఉంటాయి. సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తిని పార్టీలో చర్చిస్తాం. పెద్దిరెడ్డి నన్ను విమర్శించినంత మాత్రాన నేను స్పందించాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా మంచి కేసీఆర్ కు చెడును మోదీకి తగిలించటం టిఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిపోయిందని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి.