హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మూసీ వివాదం మరో లెవల్‌కు వెళ్లింది. సియోల్ తరహాలో హైదరాబాద్‌లో మూసీని పునరుజ్జీవింపజేస్తామంటూ తెలంగాణ లోని రేవంత్ సర్కార్ చెబుతోంది.. ఇందుకోసం ఆయన ఈనెల ఎనిమిదో తేదీన నల్గొండ జిల్లాలోని మూసీ నదీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేశారు రేవంత్. మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే బుల్జోజర్లతో తొక్కిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
రేవంత్ కామెంట్స్‌కు బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసి ప్రాంతం పేదలకు మనోధైర్యం కల్పిందేందుకు, వారికి అండగా ఉంటానని కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టిన కిషన్ రెడ్డి.. బుల్డోజర్లు వస్తే చావడానికైనా సిద్ధమేనని చెప్పారు.
ఈ క్రమంలోనే మొన్న మూసి వద్దా నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దానికి తగినట్లుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు రాత్రి అంబర్పేట్ తులసి రామ్ నగర్ మూసి పేదల నివాసం ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ముఖ్యనేతలు బస్తీ నిద్ర చేయనున్నారు.
కిషన్ రెడ్డితో పాటు, బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇతర నేతలు మూసి ఏరియాలోని 20 ప్రాంతాల్లో రాత్రి బస చేయనున్నారు. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు బీజేపీ నేతలు ఆయా ప్రాంతాల్లో రాత్రి బస చేయనున్నారు.
ఎవరెవరు ఎక్కడంటే…
అంబర్‌పేటలోని తులసీరాంనగర్‌లో కిషన్ రెడ్డి, ఓల్డ్ మలక్‌పేటలోని శాలివాహననగర్‌లో కె.లక్ష్మణ్, ఎల్బీ నగర్‌లోని గణేశ్ నగర్‌లో ఈటల రాజేందర్, రాజేంద్రనగర్‌లోని హైదర్‌షా కోటలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అఫ్జల్‌గంజ్‌లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో బీబీ పాటిల్ బస చేయనున్నారు. వారితో పాటు ఆయా ప్రాంతాల స్థానిక నేతలు కూడా బస చేస్తారు.