Wednesday, November 20, 2024

ఓటీటీల్లో ది బెస్ట్ ఫిలింగా నాగార్జున ‘వైల్డ్ డాగ్’

అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 2న విడుదలైన ఈ సినిమా కరోనా కల్లోలం వల్ల థియేటర్లలో ఎక్కువ వసూళ్లను రాబట్టలేకపోయింది. కానీ నెట్ ఫ్లిక్స్‌లో నాలుగు దక్షిణ భారత భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీల్లోనే అత్యధిక వీక్షణలు వచ్చిన సినిమాగా అగ్రస్థానంలో నిలిచింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫారంపై మిలియన్ల వీక్షణలతో ఈ చిత్రం ది బెస్ట్‌గా రికార్డు సాధించింది. భారతదేశంలోనే కాదు అమెరికా, బ్రిటన్, మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్ మరికొన్ని దేశాలలో వైల్డ్ డాగ్ ట్రెండింగ్‌లో ఉంది. బాంబ్ బ్లాస్టులు, తీవ్రవాదం నేపథ్యంలోని కంటెంట్ యూనివర్శల్ అప్పీల్ కలిగి ఉండడంతో ఇంత ఆదరణ దక్కుతోంది.

‘వైల్డ్ డాగ్’మూవీలో ఆకర్షణీయమైన కథనం, హై యాక్షన్ సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. నాగార్జున అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం రెండో వేవ్ కారణంగా ఓటీటీలకు ఆదరణ పెరిగింది. ఇది వైల్డ్ డాగ్ డిజిటల్ వీక్షణకు కలిసి వస్తోంది. ఆషిషోర్ సోలొమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్ టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement