ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్ధర్ జార్జ్.. ఛార్లెస్ -3ని బ్రిటన్ రాజుగా అధికారికంగా ప్రకటించారు. సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు క్వీన్ ఎలిజబెత్ అస్తమించినట్లు ప్రకటన చేశారు. ఛార్లెస్-3ను రాజుగా ప్రకటించిన తర్వాత ఆయన సదరు డాక్యుమెంట్‌పై సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరయ్యారు. డాక్యుమెంట్లపై సంతకం చేయడానికి ముందు రూమ్‌లో ఉన్న అందరూ గాడ్ సేవ్ ద కింగ్ అని నినాదం చేశారు. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు ఆరు మంది మాజీ ప్రధానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజుగా ప్రమాణం చేసిన కింగ్ ఛార్లెస్ తన తల్లి మరణవార్తపై ప్రకటన చేశారు. జీవిత కాలం ప్రేమను పంచాలని, నిస్వార్థ సేవ చేయాలని తన తల్లి తనకు నేర్పినట్లు ఛార్లెస్ తెలిపారు. తన తల్లి రాజ్యాన్ని ఏలిన సమయం, ఆమె అంకిత భావం, ఆమె భక్తి అసాధారణమైనవని అన్నారు. ఇది విషాదకర సమయమే అయినా, ఆమె విశ్వసనీయమైన జీవితానికి థ్యాంక్స్ చెబుతున్నట్లు కింగ్ ఛార్లెస్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement