ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్ సరికొత్త గెటప్‌లో కనిపిం చారు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే కిమ్, ఓ తెల్లటి గుర్రంపై ఠీవీగా స్వారీచేస్తున్న దృశ్యం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అడవిగుండా తెల్లటి గుర్రంపై కిమ్ దూసుకెళ్తున్న ఇతివృత్తాన్ని ఈ చిత్రం సూచిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, గతేడాది కిమ్ కార్యకలాపాలను క్రోడీకరించి కొరియా ప్రభుత్వం డాక్యుమెంటరీని చిత్రీకరించింది. ఇది చోసన్ సెంట్రల్ టీవీ ద్వారా 1వ తేదీన విడుదలైన ‘ది ఇయర్ ఆఫ్ ది గ్రేట్ విక్టరీ- 2021’ అనే డాక్యుమెంటరీ చిత్రం. ఛైర్మన్ కిమ్ తెల్లటి గుర్రంపై స్వారీ చేసే అనేక దృశ్యాలు ఇందులో ఉన్నాయి ప్రత్యేకించి, అతను ఒక చేత్తో పగ్గాలను పట్టుకుని స్వారీ చేస్తూ కనిపించాడు.
2017 తర్వాత అత్యంత శక్తివంతమైన క్షిపణి ప్రయోగంతోపాటు, దీర్ఘశ్రేణి అణు పరీక్షలను పున:ప్రారంభించవచ్చనే భయాలను పెంచడంతో పాటు, రికార్డు స్థాయిలో ఏడు ఆయుధ పరీక్షలను నిర్వహించడం ద్వారా ప్యోంగ్యాంగ్ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది. కానీ ఈ వారం విడుదల చేసిన డాక్యుమెంటరీ దేశం మాత్రం దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి కిమ్ చేసిన పోరాటాన్ని హైలైట్ చేస్తుంది. ఛిన్నాభిన్నమైన ఆర్థిక పరిస్థితులను కప్పిపుచ్చేందుకు, ప్రజలలోకి సానుభూతి పవనాలు పంపేందుకు కిమ్ చేస్తున్న ప్రయత్నమిదని కొరియన్ ప్రొఫెసర్ యాంగ్ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,