సుమారు 50 రోజుల పాటు హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో 50 లక్షలకు పైగా భక్తులు స్నానాలాచరించారు. భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే గంగానది తమ సర్వపాపాల్ని హరిస్తుందని వీరి విశ్వాసం. ఓ పక్క కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజు రోజుకు దీని సంక్రమణ వ్యాప్తి పెరుగుతోంది. కరోనా కారణంగా మరణాల సంఖ్య జోరందు కుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కరోనా కట్టడికి పలురకాల చర్యలు చేపడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా జనసందోహాల్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దశలో కూడా లక్షలాది మంది గంగలో స్నానం చేయడం ద్వారా
కరోనా దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదముందని కొందరు శంకిసు
_న్నారు. హరిద్వార్ తర్వాత కూడా గంగ సుమారు 2 వేల కిలోమీ
టర్లు ప్రయాణిస్తుంది. కోవిడ్ రోగులెవరైనా గంగలో స్నానం చేస్తే
వారి నుంచి నీటిలోకి జారే వైరస్ వందల కిలోమీటర్ల పొడవునా
ప్రయాణం చేస్తూ మార్గమధ్యలో వందలాదిమందికి సోకే ప్రమా
దాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఓ మతానికి మద్దతుగా
కరోనా సమయంలో కూడా ఇంతపెద్ద జనసమూహాల జాతరకు
అనుమతి ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. అయితే నిపుణులు ఇందుకు విరుద్ధంగా వాదిస్తున్నారు. గంగ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన నది. గంగోత్రి వద్ద హిమానీనదం నుంచి ఇది ఆవిర్భవిస్తుంది. అక్కడి నుంచి హిమాలయ సానువుల మీదుగా ప్రయాణిస్తోంది. సముద్రమట్టానికి 12,769 అడుగల ఎత్తున ఎటువంటి కాలుష్యం లేని ప్రాంతం నుంచి దీని
ప్రయాణం మొదలౌతుంది. మార్గమధ్యలో అలకనందను తనలో
కలుపుకుంటోంది. హిమాలయాల్లోని హిమానీనదం కరిగి నీరై ఈ
గంగలోకి చేరుతుంది. ఇది రుషికేష్ వద్ద నేలపై కొస్తుంది.
మార్గమాధ్యలో వందల కిలోమీటర్ల పొడవునా హిమాలయ
పర్వతాల్లోని దట్టమైన వృక్షసంపదనను ఒరుసుకుంటూ ఇది
ప్రయాణిస్తుంది. ఇందులో అత్యంత పవిత్రం, గొప్పవైన ఆయుర్వే
ద వనాలున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమమైన
జాతులకు చెందిన వృక్షాలు ఈ వనాల్లో కొలువు దీరుతున్నాయి. వీటిని తడుపుతూ వాటి వేళ్ళల్లోని సారాన్ని తనలో నింపుకుంటూ గంగ ప్రయాణిస్తోంది. సృష్టిలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ
ఆయుర్వేద మొక్కల సారాన్ని గంగ తనలో ఇముడ్చుకుంటుంది.
ఎత్తయిన కొండలు, లోతైన లోయల నడుమ ఉరుకులు,
పరుగులతో ఒక్కసారిగా రుషికేష్ వద్ద సాధారణ మైదాన
ప్రాంతంలోకి ప్రవేశిస్తోంది. అక్కడి నుంచి హరిద్వార్ కేవలం
20లోపు కిలోమీటర్ల దూరమే.
హరిద్వార్ కొచ్చేసరికి గంగ పలురకాల ఆయుర్వేద ఔషధాల సమ్మిళితంగా మారుతుంది. అందుకే గంగను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం కూడా గంగ స్వర్గం నుంచి భూమ్మీద కొస్తుంది. భగీరథుడి ప్రయత్నానికి అనుగుణగా శివుడి ఝాటా జుటం నుంచి భూమిని తాకుతుంది. అత్యంత పవిత్రం, ఆరోగ్య ప్రధాయిని అయిన గంగలో స్నానం చేసినా.. ఆ నీరు తాగినా ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. ఇక శాస్త్రీయ ఆధారం మేరకు గంగ నాలుగు కోట్ల సంవత్సరాలకు పూర్వమే ఆవిర్భవించింది. ఇది హిమాలయాల్లోని టెక్టోనిక్ కదలికల కారణంగా ఏర్పడింది.
హిమానీ నదాల్లోని అవక్షేపణ ప్రక్రియల కారణంగా అవి కరిగి
గంగలో నీరు పెరిగేందుకు కారణమయ్యాయి. సాంకేతిక
పరిజ్ఞానం మేరకు కూడా గంగ సర్వరోగాల్ని హరించే శక్తి కలిగి
ఉంది. సుమారు 3 వేల రకాల రోగాలకు కారణమైన బ్యాక్టీరి
యాను నియంత్రించగలిగే సామర్థ్యం గంగానదిలో ఉన్నట్లు
పరిశోధకులు గుర్తించారు. అలాగే పలురకాల వైరస్లను
నిర్మూలించే సామర్థ్యం రిషికేశ్, హరి ద్వారాల వద్ద గంగానదికి
ఉంది. ఇదంతా ఆ నది నీటిలో కలిసిన ఆయుర్వేద మొక్కల
సారంగానేనని నిపుణులు గుర్తించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లక్షలాది మంది స్నానాలు చేసిన హరిద్వార్‌లో నమోదౌతున్న కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువే. అది కూడా ఇతర ప్రాంతాల నుంచి తరలొచ్చిన సాధారణ భక్తులవే. వీరు స్నానాలకు ముందే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిని స్నానాలు చేయకుండా నియంత్రిస్తున్నారు. లక్షల మంది హరిద్వార్ వద్ద గంగానదిలో స్నానాలాచరించినా కరోనా విస్తృతికి అవకాశాలుండవని వైద్య నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. సాధారణ నీటిలో బ్లీచింగ్ లేదా క్లోరిన్ కలిపిన సందర్భాల్లో కూడా కరోనా వైరస్ బ్రతికి బట్టకట్టలేదు. అలాంటిది స్వయంగా ఆయుర్వేద ఔషధ గుణాల్ని నింపుకున్న గంగానది పైగా క్రిమిసంహారక ఆవుపేడతో కూడిన విభూదిని ధరించి లక్షలాది మంది మునగడం ద్వారా నదిలో క్రిమిసంహారక వ్యవస్థ మరింతగా పెరుగుతుంది.