Saturday, November 23, 2024

వైఎస్ షర్మిల ఆఫీస్ ముట్టడికి ఏపీ పరిరక్షణ సమితి యత్నం

హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్ షర్మిల కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ఏపీ పరిరక్షణ సమితి ఛైర్మన్ కొలికపూడి శ్రీనివాస్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోబోమని, అవసరమైతే ఏపీ ప్రభుత్వంతో కయ్యానికి దిగుతామని షర్మిల చేసిన ట్వీట్‌పై ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసేలా ఈ ట్వీట్ ఉందని, అందుకే షర్మిల కార్యాలయాన్ని ముట్టడించామని ఆయన తెలిపారు. కాగా ఏపీ పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు పోలీసులు అప్రమత్తమై షర్మిల ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement