చెన్నైలో కిలాడీ లేడీ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి కానీ, వయసు మీదపడ్డ వారిని టార్గెట్ చేసుకుని తన యవ్వారం కొనసాగిస్తోంది. మ్యాట్రిమొనీ సైట్లో యువతుల ఫొటోలతో గాలం వేయడం, ఆ తర్వాత యువకులను మోసం చేయడమే పనిగా పెట్టుకుంది. అయితే.. ఈ విషయాలను ఎవరికీ చెప్పుకోలేక చాలామంది కామ్‌గా ఉండిపోయారు. తాము మోసపోయామని తెలిస్తే ఇజ్జత్ పోతుందన్న భయంతో బయటపడలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ బాధిత యువకుడు పోలీసులకు కంప్లెయింట్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువతి చేస్తున్న మోసాలను మొత్తం బయటపెట్టేశారు.
మ్యాట్రిమొనీ సైట్లో యువతుల ఫొటోలతో గాలం వేయడం, వయసు పైబడిన పెళ్లికాని యువకులను టార్గెట్ చేసుకోవడమే ఆమె పనిగా పెట్టుకున్నట్టు నిర్ధారించారు. పరిచయం పేరిట చాలామంది నుంచి నగదు, ఖరీదైన స్మార్ట్ఫోన్లకు టెండర్ ఆమె టెండర్ వేసినట్టు తెలుసుకున్నారు. ఇట్లా చెన్నై, బెంగళూరులో పదుల సంఖ్యలో బాధితులున్నారు. మగాళ్ల వీక్నెస్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కిలాడీ లేడీ సంధ్యని పోలీసులు అరెస్టు చేశారు.