ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకునేదిశగా రష్యన్ బలగాలు కదులుతున్నాయి. కీవ్ నలువైపులకు బలగాలు చేరుకుంటున్నాయి. మరోవైపు కీవ్ సహా కీలక నగరాలు లక్ష్యంగా రష్యా తన భీకర దాడులను కొనసాగిస్తోంది. 17వ రోజైన శనివారంనాడు కూడా దాడులు మరింత ఉధృతం చేసింది. దక్షిణ కీవ్‌లోని ఓ మిలటరీ వైమానిక స్థావరాన్ని క్షిపణులు తాకడంతో రన్‌వే ధ్వంసమైనట్టు వాసిల్కివ్ నగర మేయర్ తెలిపారు. దీనితో పాటు ఒక ఇంధన డిపో ధ్వంసమైందని, అమ్యునేషన్ స్టోర్‌లో కూడా పేలుళ్లు సంభవిం చాయని చెప్పారు.
క్షిపణులు తాకడంతో ఎయిర్‌ఫీల్డ్ నుంచి దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్ముకున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఒక వీడియాల్లో కనిపిస్తోంది. కీవ్‌కు అతి సమీపంలోని పలు నగరాల్లో ఇళ్ల సముదాయాలపై దాడులు నిర్వహిస్తోంది. దానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను మాక్సర్ టెక్నాలజీస్ షేర్ చేసింది. రాత్రి జరిపిన కాల్పుల్లో కీవ్ దక్షిణంగా 36 కిలోమీటర్లు దూరంలో ఉన్న వాసిల్కివ్‌లో చమురు డిపో మంటల్లో చిక్కుకుపోయింది. మరో దగ్గర ఆహార ఉత్పత్తులను భద్రపరిచిన గిడ్డంగి మంటలకు ఆహుతైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..